Thursday, April 25, 2024
- Advertisement -

సన్నిహితుల సమక్షంలో… నటి మెహ్రీన్ నిశ్చితార్థం..!

- Advertisement -

టాలీవుడ్ నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత, అదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో జైపూర్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఓవైపు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తున్న మెహ్రీన్ పెళ్లికి సంబంధించి కనీసం గుసగుసలు అయినా టాలీవుడ్ లో వినిపించలేదు. కానీ సడెన్ గా భవ్య బిష్ణోయ్ తో జైపూర్ లో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. వివాహానికి చాలా ముందే తన ఇంట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

మెహ్రీన్ సోదరుడు గుర్ ఫతే  కూడా నటుడిగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. నెట్‌ ఫ్లిక్స్ మూవీ ‘గిల్టీ’లో అతను నటించాడు. తన సోదరి, కాబోయే బావతో కలిసి దిగిన ఫోటోలను అతను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ  వివాహ వేడుక పంజాబీ సంప్రదాయంలో ఘనంగా జరుగబోతోందని ఆ ఫోటోలను చూస్తే అర్థమౌతోంది. 

‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఎఫ్-2, కవచం, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో నటిస్తోంది. తన స్నేహితులు తమన్నా- కయాని ప్రియదర్శన్- రాహుల్ వైద్య తదితరులు ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా మెహ్రీన్ పెళ్లికి అటెండవుతారని భావిస్తున్నారు.

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

తెలంగాణలో ఇక ఉల్లంఘనలు.. మొత్తం ఆదివారం కి సిద్దం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -