Friday, April 19, 2024
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఇటీవ‌లి కాలంలో తెగ చ‌ర్చ రేపిన సినిమా ఏదైనా ఉందంటే అది “ఉప్పెన” మూవీ మాత్ర‌మే. ఈ సినిమాకు హీరో హీరోయ‌న్ల‌తో పాటు ద‌ర్శ‌కుడికి కూడా మొద‌టి సినిమానే. అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్‌, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టిల అద్భుత న‌ట‌న‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తూ.. రికార్డుల మోత మోగింగిచింది.

దీంతో ఈ సినిమా డైరెక్ట‌ర్‌, హీరో, హీరోయిన్లతో సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు మ‌స్తు ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఈ విష‌యంలో హీరోయిన్ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి కృతిశెట్టి కాస్త ముందుంద‌ని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. దీంతో ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన ట్రైల‌ర్ తోనే సినిమా విడుద‌ల ముందే ఈ అమ్మ‌డికి హీరో నానితో న‌టించే ఛాన్స్ ను కొట్టేసింది. అలాగే, హీరో రామ్‌తో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

ఇదిలా ఉండ‌గా, ఈ అమ్మడికి మ‌రో సూప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. అదే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం.మహేశ్ ప్ర‌స్తుతం “స‌ర్కారు వారి పాట” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్త‌యిన వెంట‌నే రాజ‌మౌళితో సినిమా చేసే అవ‌కాశాలున్నాయి. అయితే, ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డానికి కాస్తా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో.. ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడి తో సినిమా చేయ‌డానికి ప్రిన్స్ ఒకే చెప్పాడ‌ని తెలిసింది. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న కృతిశెట్టి న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -