రాం చరణ్ – శ్రీను వైట్ల ల కాంబినేషన్ మాత్రమె కాకుండా చిరంజీవి కామియో కూడా ఇస్తూ ఉండడం తో బ్రూస్ లీ సినిమా కి ఎక్కడ లేని ఆదరణా లభిస్తోంది, ఈ సినిమా కి మంచి అడ్వాన్స్ బుకింగ్ లు సాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా కర్ణాటక, తమిళ నాడు లో సినిమా కి మంచి ప్రమోషన్ లో బాగా చేస్తూ ఉండడం తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కి సిద్దం అవుతోంది .
ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉండడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్ ల విషయం లో మంచి క్రేజ్ సాగుతోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే బుక్స్ అయిపోయాయి కూడా.
ఫస్ట్ ఫీక్ ఎండ్ వరకూ బ్రూస్ లీ అడ్వాన్స్ లో క్లోజ్ చేసినట్టు చాలా వెబ్ సైట్ లు ఇప్పటికే ప్రకటించాయి. మెగా స్టార్ చిరంజీవి చాలా కాలం తరవాత తెరమీద కనిపించబోతూ ఉండడం తో ఈ పరిణామం వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. చిరంజీవి కేవలం 4 నిమిషాలు ఒక ఫైట్ లో కనపడబోతున్నారు.
ఈ సినిమా కి నిడివి పూర్తిగా 146 నిమిషాలు అని చెబుతున్నారు అంటే రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గా కట్ చేసారు. ఈ మధ్య కాలం లో సినిమాలు తక్కువ నిడివి లో లాగించేస్తున్నారు.