Wednesday, May 15, 2024
- Advertisement -

ఘోరంగా ప్లాప్ అయిన చిత్రాల కలెక్షన్లు ఇవే!

- Advertisement -

టాలీవుడ్ లోని టాప్ హీరోలకి మంచి మార్కెట్ ఉంది. అయితే సినిమా సూపర్ హిట్ అయితే ఏ రెంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అదే సినిమా ప్లాప్ అయితే అదే రెంజ్ లో నష్టం వస్తుంది. కనీసం బయ్యర్స్ కు పెట్టిన డబ్బులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు.

అయితే ఎంత పెద్ద హీరో అయినా సినిమా హిట్ అయితేనే అన్నీ..లేదంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయినా డిజాస్టర్ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ నిరూపించింది. ఇక అదే క్రమంలో శ్రీమంతుడు సినిమాతో దాదాపుగా 80కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవం తో మాత్రం బయ్యర్స్ కు నష్టాలే మిగిల్చాడు. మరి ఇలా చేదు అనుభవాన్ని మిగిల్చిన కొన్ని సినిమాలకు ఒక లుక్ వేద్దాం రండి.

* పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవల విడుదలై భారీ ప్లాప్ అయింది. ప్లాపైనా ఈచిత్రం రూ. 52.92 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 40.94 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ప్లాప్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

* ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ చిత్రం భారీ ప్లాప్ అయింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 34.05 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 21.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు న్రాహ్మోత్సవం పరిస్థితి అదే రకంగా కనిపిస్తుంది.

* రామ్ చరణ్ గత చిత్రం ‘బ్రూస్ లీ’ చిత్రం ప్లాపైన సంగతి తెలిసిందే. ఈచిత్రం వరల్డ్ వైడ్ 40.91 కోట్లు వసూలు చేసింది. ప్లాపుల్లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఏపీ, తెలంగాణల్లో రూ. 32.36 కోట్లు వసూలు చేసింది.

* అల్లు అర్జున్ కెరీర్లో ప్లాప్ అంటే ‘వరుడు’ చిత్రమే. ఈచిత్రం అప్పట్లో రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘బ్రదినాథ్’ చిత్రం చాలా ఏరియాల్లో నష్టాలనే మిగిలిచ్చినా సీడెడ్, కర్ణాటక లాంటి కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది.

* ఎన్టీఆర్ గత చిత్రం ‘రామయ్యా వస్తావయ్య’ ప్లాపే. ఈ చిత్రం రూ. 30.23 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 23.83 కోట్లు వసూలు చేసింది. మరో ప్లాప్ రభస 26.34 కోట్లు వసూలు చేయగా ఏపీ, తెలంగాణల్లో 20.84 కోట్లు వసూలు చేసింది.

* ప్రభాస్ ప్లాపు చిత్రం ‘రెబెల్’25.40 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 21.26 కోట్లు వసూలు చేసింది.

Related

  1. పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకో
  2. సూపర్ .. మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చిత్రం !
  3. మహేష్ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది!
  4. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -