Saturday, April 20, 2024
- Advertisement -

ప్రేమకథల స్పెషలిస్ట్ ని పట్టేసిన అఖిల్..! ఈ సారైనా హిట్ పక్కానా..!

- Advertisement -

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా తన మొదటి సినిమాకి ముందే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ తెచ్చుకున్నాడు. కచ్చితంగా తెలుగులో మరో స్టార్ హీరో అవుతాడని అంతా భావించారు. అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’ ఆడియో ఫంక్షన్ లో మహేష్ బాబు మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ పీస్ ని అందజేస్తున్నందుకు నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపాడు. కానీ అఖిల్ పై ఉన్న అంచనాలు తిరగబడ్డాయి. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఆయన ఖాతాలో ఇప్పటికి కూడా హిట్ పడలేదు.

కానీ ప్రస్తుతం అఖిల్ లైనప్ చూస్తే ఈసారి మాత్రం అఖిల్ కు హిట్ పక్కా అనిపిస్తోంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.ఈ సినిమా తర్వాత స్టైలిష్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమాను అఖిల్ చేస్తున్నాడు.

Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అఖిల్ ప్రేమకథల స్పెషలిస్ట్ హను రాఘవపూడి తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు వంటి లవ్ స్టోరీస్ తెరకెక్కించాడు. ఇటీవల హను అఖిల్ కు ఒక కథ చెప్పగా అది నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానుంది.

Also Read: అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -