Saturday, April 20, 2024
- Advertisement -

నా బయోపిక్​ తీయకండి.. ప్లీజ్​

- Advertisement -

బాలీవుడ్​లో అగ్ర నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రా. ఆ తర్వాత హాలీవుడ్​కు వెళ్లిపోయింది. అక్కడ కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నది. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు నిక్​ జోనాస్​ను వివాహం చేసుకున్న ప్రియాంక .. హాలీవుడ్​లో అగ్రకథానాయికగా ఎదిగేందుకు ట్రై చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రాపై బయోపిక్​ తీయాలని ఎప్పటినుంచో బాలీవుడ్​లో టాక్​ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకతో ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఓ జర్నలిస్ట్​.

దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ దయచేసి నా మీద బయోపిక్​ తీయకండి. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అప్పుడే నన్ను గొప్పదాన్ని చేసేయకండి’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం టాలీవుడ్​, బాలీవుడ్​, కోలివుడ్​లో బయోపిక్​ల ట్రెండ్​ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ ప్రముఖులపై బయోపిక్​లు రూపొందిస్తున్నారు మేకర్స్​.

Also Read: తాజా రాజకీయాలపై ‘ఆచార్య’ లో పంచ్​లు

ఈ క్రమంలో హాలీవుడ్​ స్థాయికి ఎదిగిన ప్రియాంకా చోప్రాపై బయోపిక్​ రాబోతుందని టాక్​ వినిపించింది. తమిళ చిత్రం ‘తమిజాన్‌’తో నాయికగా ప్రియాంక చోప్రా సినీ కెరీర్​ ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్​లో అడుగుపెట్టి వరస విజయాలతో ఆమె దూసుకుపోయింది. హాలీవుడ్​లోనూ అవకాశాలు దక్కించుకున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మాట్రిక్స్‌’, ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి. ఇక ప్రియాంక చోప్రా.. నిక్​ జోనాస్ జంట ఎంతో పాపులర్​. వీళ్లిద్దరూ తరుచూ వివిధ వేదికల మీద కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

Also Read: చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -