అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప- 1 ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ముందు ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాదని మేకర్స్ ప్రకటించారు. అయితే వినాయక చవితికి కానీ దసరాకు కానీ సినిమా తప్పకుండా విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు.

పుష్ప సినిమా ఈ ఏడాది విడుదల కాదని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలవుతుందని ఇటీవల వరుసగా వార్తలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల అవుతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. సాధ్యమైనంత తొందరగా మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ తో పాటు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. సెప్టెంబర్లో అఖండ, ఆచార్య సినిమాలు విడుదలవుతుండగా దసరా సందర్భంగా ఆర్ఆర్ఆర్ విడుదల అవుతోంది. ఈ మూడు సినిమాలు విడుదల కాగానే పుష్ప తెరమీదకి వస్తుందని సమాచారం. అలాగే పుష్ప -2 వచ్చే ఏడాది ఆఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read

బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

అగ్ర హీరోల సినిమాలూ ఓటీటీ బాటే.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్​..!

ఆర్​ఆర్​ఆర్​ మ్యూజిక్​ అరుపులేనా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -