Monday, April 29, 2024
- Advertisement -

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ” . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం వచ్చిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాంతో ” పుష్ప పార్ట్ 2 ” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మద్యనే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. అదేమిటంటే.. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడట. .

అది కూడా చరణ్ కెరియర్ బెస్ట్ పాత్ర అయిన చిట్టిబాబు క్యారెక్టర్ లో. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా చిట్టిబాబు క్యారెక్టర్ లో చరణ్ నట విశ్వరూపం చూపించడనే చెప్పాలి. అలాంటి చిట్టిబాబు క్యారెక్టర్ ను పుష్ప పార్ట్ 2 కి సుకుమార్ లింక్ చేయబోతున్నారని సమాచారం. రంగస్థలం మరియు పుష్ప రెండు కూడా 1980 లో జరిగే కథాంశలు కావడంతో పుష్ప యూనివర్స్ క్రియేట్ చేసేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. ఇక సుక్కు తరువాతి సినిమా కూడా చరణ్ తోనే ఉండడంతో ఈ వార్తలు నిజమే అని ఇండస్ట్రీ సర్కిల్స్ లో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఈ మద్య మూవీ యూనివర్స్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. విక్రమ్ మూవీ తో లోకేశ్ కనకారాజ్ అలాగే హిట్ మూవీతో శైలేష్ కొలను వంటి దర్శకులు సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇదే కోవలో ఇప్పుడు సుక్కు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే బన్నీ చరణ్ మరోసారి ఒకే మూవీలో కనిపించడం ఖాయమే అని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరు ” ఎవడు ” మూవీలో కనిపించారు. దీంతో మళ్ళీ ఇన్నాళ్లకు సుకుమార్ దర్శకత్వంలో కెరియర్ బెస్ట్ రోల్స్ లో ఈ మెగా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవదులు ఉండవనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మోక్షజ్ఞ కోసం బాలయ్య ఏం చేస్తున్నాడంటే..?

ఫ్యాన్స్ నుంచి పవన్ కు హెచ్చరికలు !

రవితేజను లైన్లో పెడుతున్న పూరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -