Monday, May 6, 2024
- Advertisement -

వారసుడు మహేశ్ కథే !

- Advertisement -

వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న వారసుడు మూవీపై తెలుగు తమిళ్ రెండు ఇండస్ట్రీలలో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎందుకంటే తమిళ్ విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక తెలుగు విషయానికొస్తే.. గత కొన్నాళ్లుగా విజయ్ మూవీస్ తెలుగులో కూడా రాణిస్తున్నాయి. దాంతో తెలుగులో విజయ్ కి మంచిగానే మార్కెట్ ఉందనే చెప్పవచ్చు. అంతే కాకుండా మొట్టమొదటి సరిగా ఓ తెలుగు డైరెక్టర్, తెలుగు నిర్మాణ సంస్థలో విజయ్ నటిస్తుండడంతో ” వారసుడు ” మూవీపై తెలుగులో కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. అంతే కాకుండా ఇటీవల థియేటర్ల విషయంలో కూడా వారసుడు మూవీపై గట్టిగానే కాంట్రవర్సీ నదించింది. .

దాంతో ఎటోచ్చి వారసుడు మూవీపై హైప్ బాగానే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతోంది చిత్రా యూనిట్. ఇదిలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసుడు స్టోరీ మొదట మహేశ్ తో చేయాలని భావించరాట. స్టోరీ కూడా మహేశ్ వినిపించారట. అయితే ఏమైందో తెలియదు గాని మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత రాంచరణ్ కు కూడా ఈ స్టోరీ వినిపించారట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. కానీ తనకున్న కమిట్మెంట్స్ వల్ల రాంచరణ్ మూవీ నుంచి వాకౌట్ చేశారట. ఇక ఫైనల్ గా వారసుడు స్టోరీ తలపతి విజయ్ వద్దకు వెళ్ళగా విజయ్ వెంటనే ఒకే అనేయడంతో చక చక షూటింగ్ కంప్లీట్ చేసుకొని, ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. మొత్తానికి మహేశ్, రామ్ చరణ్ వంటి బడా హీరోలను దాటుకొని.. విజయ్ వద్దకు వెళ్ళిన ” వారసుడు ” ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సెట్స్ పైకి వెళ్లకుండానే ఎన్టీఆర్ టీజర్ ?

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -