Friday, April 26, 2024
- Advertisement -

వార్ని.. అలాంటి భారీ ప్రాజెక్టు ను వదులుకున్న సమంత?

- Advertisement -

టాలీవుడ్‌ అగ్రనటి సమంత ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైది.”ది ఫ్యామిలీ మ్యాన్ 2″ వెబ్ సిరీస్ తో బాలీవుడ్లో అడుగుపెట్ట మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సిరీస్ లో సమంత శ్రీలంక టెర్రరిస్టుగా డీ గ్లామర్‌ అద్భుతంగా నటించడంతో ఆమెపై విమర్శలు చేసిన వారు సైతం తన నటపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ వెబ్ సిరీస్ కారణంగా సమంత పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. దీంతో సమంత పాన్ఇండియా స్టార్ గా పలు అవకాశాలను కొల్లగొడుతోంది.

తాజాగా సమంతాకు నెట్‌ఫ్లీక్స్‌ ఓటీటీ సంస్థ ఓ భారీ ఆఫర్‌ ఇచ్చిందట. ప్రభాస్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం”బాహుబలి బిఫోర్‌ ది బిగినింగ్‌” పేరుతో వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్‌ ఎంతోకాలం నుంచి ప్లాన్‌ చేస్తోందట.ఈ సిరీస్ లో శివగామి పాత్ర కోసం సమంతను సెలెక్ట్ చేసి సంప్రదించినట్లు సమాచారం.అయితే సమంత ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సమంత ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

Also read:రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి..?

ప్రస్తుతం సమంత పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Also read:సోంపు తినండి.. ఆ సమస్యకు చెక్ పెట్టండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -