Monday, April 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ బర్త్ డేకి బిగ్ బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తో గ్రాండ్ సక్సెస్ అందుకొని మరోసారి పవనిజం స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా పిరియాడిక్ జోనర్‌లో “హరిహర వీరమల్లు” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

17వ శ‌తాబ్దం మొగల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతోన్న “హరిహర వీరమల్లు” చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ 27వ చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

Also read:సంక్రాంతికి రిలీజ్ అయ్యేది రెండు సినిమాలే..?

ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శక, నిర్మాతలు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ “హరహర వీరమల్లు” సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌ సినిమాలలో నటిస్తున్నాడు.

Also read:మరోసారి రామ్ చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -