Monday, April 29, 2024
- Advertisement -

హైప‌ర్ ఆది గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు

- Advertisement -
All screen Actor Hipera Aadhi shocking news

జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా చాలా మందికి అవకాశం దొరకడంతో పాటు.. సినిమాలలో కామెడి క్యారెక్టర్లు కూడా వస్తున్నాయి. ఇక యాంకర్ కి మొదలు స్కిట్ లో చేసే అందరికి దాదాపుగా సినిమా చాన్సులు వస్తూనే ఉన్నాయి. హైపర్ ఆది ఈ మధ్య బాగా ఫాపులర్ అయ్యాడు. తన వేసే పంచ్ ల తోనే అందరిని తెగ నవ్విస్తాడు.

మరి అదికి జబర్ధస్త్ లో చాన్స్ ఎలా వచ్చిందో ఆది మాటల్లోనే చూద్దాం.. 2012లో బిటెక్‌ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్‌లో రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేశాను. అందరిలాగే నేనూ మా ఆఫీసుకి వెళ్తూనే యూట్యూబ్‌లో జబర్దస్త్‌ చూస్తూ ఎంజాయ్‌ చేసేవాడ్ని. త్రివిక్రమ్‌గారు సిరివెన్నెల గురించి గొప్పగా చెప్పిన మాటల్ని పేరడీ చేసి యూట్యూబ్‌లో పెట్టాను. ఆ వీడియోకి కొద్దిరోజుల్లోనే లక్షల హిట్స్‌ వచ్చాయి. నా డైలాగ్స్ చూసి జబర్ద్‌స్తలోని టీం లీడర్‌ అదిరే అభి అన్నయ్య ఓసారి కలవమని ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టారు. కలిశాక నీడైలాగ్స్‌ బావున్నాయి. రాస్తావా అని అడిగారు. అంతకుముందే క్యారెక్టర్‌ ఉంటే చెప్పమని.. అడగటం వల్ల అభిగారు ఓ రోజు కాల్‌ చేసి స్టూడియోకి రమ్మన్నారు.

అలా ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత వేదిక వెనుక, పక్కన ఉండేవి, డైలాగ్‌ చెప్పి వెళ్లిపోయే సీన్స్‌ చేశాను. అప్పుడప్పుడు టీం లీడర్స్‌కు కొన్ని డైలాగ్స్‌ చెప్పేవాడ్ని. బావుంటే తీసుకునేవారు. అదిరే అభి టీమ్‌లో నాకు పార్టిసిపెంట్‌గా అవకాశం వచ్చింది. అప్పటికే స్ర్కిప్ట్‌ రాసే విధానం తెలిసింది. ఇక అక్కడ నుంచి వరసగా 15 స్కిట్స్‌ రాశాను. డైలాగ్స్ రాయటంతో పాటు క్యారెక్టర్స్‌ కూడా వేశాను. వరసగా స్కిట్స్‌ కొట్టడం వల్ల తొందరగా క్రేజ్ వచ్చింది. కొన్నాళ్లకు నాకు టీమ్‌ లీడర్‌గా చాన్స్ వచ్చింది. భాస్కర్‌టీమ్‌లోని రాజుగారిని నాకు అప్పజెప్పారు.

అలా హైపర్‌ ఆది, రైజింగ్‌ రాజు జోడీ తయారైంది. ఎవరైనా అవతలివారు ఇలా డైలాగ్‌ చెప్పారో లేదో.. నా నుంచి వెంటనే రియాక్షన్‌ వచ్చేస్తుంది. అందుకే నన్ను హైపర్‌ ఆది అన్నారంతా. అని చెప్పుకొచ్చాడు ఆది. ఆది స్టార్టింగ్ లో అభి టీంలో చిన్న క్యారెక్టర్లు వేసేవాడు.. అవి కాస్త మెల్లగా మెయిన్ క్యారెక్టర్ వేసే స్థాయికి వెళ్ళడం టైమింగ్ కుదరడం తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆది మెయిన్ క్యారెక్టర్ వేసేటప్పుడు సుమారు 50000 తీసుకోగా ఇప్పుడు టీం లీడర్ గా 2 లక్షలు తీసుకుంటున్నాడు. అంతేకాకుండా ఏదైనా షో కు వెళ్ళి స్కిట్ చేసినా లక్షన్నర తీసుకుంటాడు.

Related

  1. కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్
  2. జబర్దస్త్ కమెడియన్ పై కేసు.. అసలు ఏం జరిగింది?
  3. జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య
  4. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -