ఒకప్పుడు అల్లరి నరేష్.. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్.. చేతిలో నాలుగు సినిమాలో అనే విధంగా ఉండేది. ఆ మూడు సినిమాలో.. ఒక్కటి ప్లాప్ అయిన.. మరోకటి హిట్ అయేది. అందుకే చిన్న నిర్మాతలు ఎక్కువగా నరేష్ తో సినిమాలు చేయడానికి.. ముందుకు వచ్చేవారు.
కానీ సుడిగాడు మూవీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నరేష్.. ఆ తర్వాత ఐదేళ్లుగా హిట్ ముఖమే చూడలేదు. వరస ప్లాపులతో బాగా వెనకబడిపోయాడు. ఒకప్పుడు నరేష్ ఎంతగా నవ్వించాడో గుర్తు చేసుకుని.. అతడి మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ తో.. తనకో హిట్టు వస్తే బావుణ్నే అనుకుంటున్నారు జనాలు. ఐతే ఇలాంటి జాలి చూపులు తనకిష్టం ఉండవని అంటున్నాడు నరేష్.
{loadmodule mod_custom,GA2}
సినిమాల ఎంపికలో తన ఆలోచనలు మారాయని.. ఇకపై తన సినిమాల ఫలితాలు కూడా మారతాయని అతనన్నాడు. పాపం నరేష్ కు ఒక హిట్ వస్తే బాగుంటుంది అని.. నా మీద ఎవరైన జాలీ చూపిస్తే తట్టుకోలేనని.. నాపై ఎవరు జాలి చూపించాలని అనుకోనని.. సినిమా కథలు ఎంచుకోవడంలో తప్పు వల్లే.. తన సినిమాలు ప్లాప్ అయ్యాయని అన్నాడు. అందుకే ఇప్పుడు పద్దతి మార్చానని.. గతంలో లో కాకుండా.. కథల విషయంలో ఆచితూచి అడుగులు వెస్తానని అన్నాడు. నవ్విస్తూనే కథకు.. భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేస్తానని.. కాలంతో పాటు కామెడీ మారుతోంది. అందుకే.. సటిల్ కామెడీని ఎక్కువ ఇష్టపడుతున్నారు అని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న మేడ మీద అబ్బాయి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని నరేష్ అన్నాడు.
{youtube}XjAma3bTnas{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
