Monday, April 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్

- Advertisement -
dj audio allu arjun sensational comments pawan

టాలీవుడ్ లో ఏ హీరో ఆడియో ఫంక్షన్ అయినా.. సరే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అభిమానుల హంగామా ఏ రెంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదే విషయంలో..  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చెప్పను బ్రదర్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఇక ఆ రోజు నుంచి పవన్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ పై ఎలా పగపట్టారో అందరికి తెలిసిందే.

{loadmodule mod_custom,GA1} 

బన్నీ డీజే టీజర్.. రాగానే ఆ టీజర్ విషయంలో పవన్ ఫ్యాన్స్.. నెగటివ్ లైకులు కొట్టడం తెలిసిందే. పవన్ అర్జున్ మధ్య దూరం ఎంతున్నా అభిమానులు మధ్య దూరం మాత్రం చాలా దూరం వెళ్లింది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ ఈ సిచ్యువేషన్ బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. నిన్న జరిగిన దువ్వాడ జగన్నాధం ఆడియోలో కూడా తాను ఈ పొజిషన్ లో ఉండటానికి కారణం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్.. సినిమా అభిమానులంటూ బన్ని బాంబ్ పేల్చాడు. అంతేకాదు.. మెగా ఫ్యాన్స్ అంటే మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్.. రాం చరణ్, తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ ఇలా అందరి ఫ్యాన్స్ అంటూ అందరిని కలిపి చెప్పేశాడు.

{loadmodule mod_custom,GA2} 

పవర్ స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి ఈ మాట చెప్పాడని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యే.. ప్రయత్నంలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కెలికినంత పని అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన డీజే సినిమా ఈ నెల 23న విడుదల అవబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్దె హీరోయిన్ గా నటిస్తోంది. 

{youtube}y7Nz34yiR5Y{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తొలిప్రేమలో పవన్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎక్కడ..?
  2. డీజే ట్రైలర్ చూసి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  3. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  4. పవన్ మూవీకి అంత డిమాండా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -