Monday, April 29, 2024
- Advertisement -

అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ రివ్యూ!

- Advertisement -

గత కొంత కాలంగా అల్లరి నరేష్ కి పెద్దగా సక్సెస్ లు కలిసి రావడం లేదు. మల్టీస్టారర్ మూవీస్ లో నటించినా ఏ సినిమా కలిసి రావడం లేదు. తాజాగా ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘నాంది’ సినిమా లో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ శిష్యుడు డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది.

అల్లరి నరేష్ జైల్లో నగ్నంగా కనిపించి మరో శేషుని తలపిస్తున్న ఈ మూవీకి సెన్సార్ ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో డైలాగ్స్ చాలాబాగా ఆకట్టుకున్నాయని, డైరెక్టర్ కొత్తవాడైనా చాలా చక్కగా సినిమాని తీశాడని చెప్తున్నారు. అంతేకాదు, ఫస్ట్ హాఫ్ అంతా కూాడ సినిమా సమాజంలో జరిగే పరిస్థితులని ఆలోచింపజేసే విధంగా ఉందని అన్నారు.

సినిమాపై మంచి రిపోర్ట్ ఇవ్వడంతో ఈసినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లరి నరేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా అంటూ సెన్సార్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్, అల్లరి నరేష్ యాక్టింగ్ హైలెట్ అని చెప్తున్నారు. ఈసినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయం..!

వంట‌ల‌క్కకు ఎసరుపెడుతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -