Friday, May 3, 2024
- Advertisement -

ప్రెండ్లీ గవర్నమెంట్ అంటూ.. పీఆర్‌సీ కి కన్నం..!

- Advertisement -

మొన్నటి వరకు తెలంగాణ ఉద్యోగులు పీఆర్సీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటి నుంచి ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని.. ఇది ఫ్రెండ్లీ ఎంప్లాయి గవర్నమెంట్ అంటూ కేసీఆర్ సర్కార్ అంటున్న విషయం తెలిసిందే. ఈ సారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టి ఆర్ ఎస్ కి కనువిప్పు కలిగించనున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

ప్రెండ్లీ గవర్నమెంట్ అంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ… చెలగాటమాడు తున్నారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ సవరిస్తారని పేర్కొన్నారు.

పీఆర్‌సీ 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తే… ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలని శాసించేవి… ఇప్పుడు మాత్రం తమకు కేసీఆర్ మీద నమ్మకం ఉందని చెబుతున్నాయని ఎద్దేవా చేశారు.

45శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో కాంగ్రెస్ కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలు చేస్తే ఇప్పుడేమో బిజేపి రివర్స్​లో వెళ్తోందని విమర్శించారు.

రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయం..!

షేక్ పేటకు చేరుకున్న మృతదేహాలు.. మొత్తం విషాదం..!

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -