Friday, April 26, 2024
- Advertisement -

అప్పుడు తేజు సాహసం.. ఇప్పుడు చైతూ వంతు..!

- Advertisement -

కరోనా మొదటి వేవ్ సమయంలో మహమ్మారికి వచ్చిన విపరీత ప్రచారంతో జనాలు బాగా భయపడేవారు. అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా కరోనా సోకిన వారంతా చనిపోరని, ముందే వైద్యం తీసుకుంటే సేఫ్ గా బయటపడవచ్చని జనం తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకోవడానికి జనానికి చాలా సమయమే పట్టింది. కరోనా మొదటి వేవ్ ముగిసి థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో ప్రారంభమైన సమయంలో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు భయపడ్డారు. అసలు జనం థియేటర్ల వైపు వస్తారో, రారో అని ఆందోళన చెందారు.

అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నిర్మాతలు ధైర్యం చేసి మూవీ ని విడుదల చేయగా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కూడా తగ్గుతూ వస్తోంది. జూలై మొదటి వారంలో తెలంగాణలో, ఆ తర్వాత వారం పది రోజులకు ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తాయని టాక్ నడుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు ప్రారంభించడానికి అనుమతించే అవకాశం ఉంది.

అయితే ఈ ఏడాది థియేటర్లు తెరుచుకోగానే విడుదలయ్యే మొట్టమొదటి సినిమాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ అని చెబుతున్నారు. సమ్మర్ లో నే విడుదల ఈ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే ఆలస్యం కావడంతో థియేటర్లు తెరుచుకోగానే విడుదల చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. కాగా నాని నటించిన టక్ జగదీశ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ప్రారంభమైన వెంటనే విడుదలయ్యే సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెబుతున్నారు.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

రాయలసీమ బ్యాక్​డ్రాప్ లో రవితేజ మూవీ..!

బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -