‘పుష్ప’లో రష్మిక పాత్ర ఏంటో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఛలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన కన్నడ బ్యూటీ వరుస విజయాలతో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక మందన.

తాజాగా రష్మీక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర ఇది. ఆడియన్స్ కి నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది. అలాగే రెండో భాగంలో కూడా తాను కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు.

- Advertisement -

ఇక ఇప్పటికే రష్మీక లుక్ ని చూస్తే ఒక విలేజ్ గర్ల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అర్థం అవుతోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది. మొత్తం మీద రష్మిక పాత్ర ఎలా ఉంటుంది ఆమెను దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నారు అనేది ఫ్రాన్స్ లో ఆసక్తి నెలకొంది.

కర్నూల్ లో పడగవిప్పిన పాతకక్షలు.. వేట కొడవళ్లతో నరికి అన్నదమ్ముల దారుణ హత్య..

జబర్దస్త్ టీమ్ లీడర్ కు తీవ్ర అనారోగ్యం..?

చెక్కపెట్టలో కొట్టుకొచ్చిన పసికందు..! ఎక్కడంటే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -