మెగా కాంపౌడ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు, వస్తున్నారు కూడా. అయితే మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరోలందరు బాగానే రాణిస్తున్నారు. ఒక్కరు తప్ప. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అయింది. కాని ఇప్పటి వరకు సరైన హిట్‌ను నమోదు చేయలేదు. మరోసారి అల్లు శిరీష్ తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. అల్లు శిరీష్ తాజాగా హీరోగా నటించిన సినిమా ఏబిసిడి. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం ఉదయం విడుదల చేశారు. అమెరికాలో పుట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తిగా అల్లు శిరీష్ నటించాడు.
ఏదో కారణం వల్ల ఇండియాకు రావాల్సి వస్తుంది. ఇక్కడ సగటు మధ్య తరగతి కష్టాలను చవి చూడటం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే రూపాయి విలువ బాగా తెలిసివస్తుంది.టీజర్‌ను చూస్తుంటే కామెడీ ప్రధానంగా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించిన , ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ ఖాతాలో హిట్టు వస్తుందని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
- Advertisement -
ఈ సినిమాతో అయిన హిట్ కొడతావా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -