Saturday, April 27, 2024
- Advertisement -

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

- Advertisement -

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటించిన పూర్తిస్థాయి రొమాంటిక్ కథా చిత్రం గెహ్రీయాన్. షకున్‌ బత్రా దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. ఇందులో దీపిక నటుడు సిద్ధాంత్‌ చతుర్వేదితో కలిసి బోల్డ్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించింది. తొలుత ఈ సీన్స్‌కి సంబంధించి దీపిక పలు విమర్శలు ఎదుర్కొంది.

నటుడు రణ్‌వీర్‌ సింగ్‌తో వివాహమైన అనంతరం దీపికా పదుకొణె నటించిన పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రం ఇది. ‘‘ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు మీ భర్త అనుమతి తీసుకున్నారా?’’ అని సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొణెను కొందరు అడగగా.. వాటికి ఘాటుగానే బదులిచ్చింది.

అమెజాన్ సంస్థ ఈ చిత్ర హక్కుల కోసం రూ.100కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నవతరం ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అనన్యపాండే, సిద్ధాంత్‌ చతుర్వేది కీలకపాత్రలు పోషించారు. దీపిక సోదరి పాత్రలో అనన్య నటించగా.. ఆమెకు కాబోయే భర్తగా సిద్ధాంత్‌ మెప్పించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని రూ.70కోట్ల వ్యయంతో నిర్మించగా.. అందులోని రూ.20కోట్లు దీపిక పారితోషికమేనట. అటు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో దీపిక పదుకొణె ఒకరు.

లాల్ సింగ్ చ‌ద్దా కోసం ఆదిపురుష్ వాయిదా

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

కేతికా శర్మ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -