సోషల్ మీడియాలో తనపై అసభ్య కామెంట్లు చేసిన వారికి ఘూటుగానే సమాధానం ఇస్తుంటారు యాంకర్ అనసూయ భరద్వాజ్. అయినప్పటికీ ఆమెపై ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో అనసూయను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. తాజాగా ట్విటర్ వేదికగా తనపై నెగెటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ పై ఆమె ఫైర్ అయ్యారు .
మూడేళ్ల క్రితం నాటి ఫోటోపై స్పందిస్తూ ఓ నెటిజన్ రంగమత్తను అసభ్య పదజాలంతో దూషించాడు. టీవీ షో ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనసూయ లోబీపీ కారణంగా కళ్లు తిరిగిపడిపోయింది. ఈ ఫోటోను పట్టుకొని అందరి అటెన్షన్ కోసం అనసూయ ఇలా చేస్తుందని నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. సాధారణంగా ఇలాంటి ట్రోల్స్‌ను లైట్ తీసుకొనే ఈ భామ దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
‘ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సులభం. ఆ సమయంలో నాకు లోబీపీ ఉంది. 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొనడంతో కళ్లు తిరిగిపడిపోయాను. దాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు. నన్ను అసభ్యంగా దూషించాలని టార్గెట్ చేసి మూడేళ్ల క్రితం వీడియో చూసి ఇలా కామెంట్ చేస్తున్నావా? కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు మీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. నేను కూడా నీపై అసభ్యపదజాలం వాడగలను. కానీ, మా తల్లిదండ్రులు అలా పెంచలేదు’అని సదరు నెటిజన్ ను అనసూయ కడిగిపారేసింది. కాగా సోషల్ మీడియాలో అనుసూయకు అండగా నిలుస్తున్నారు. మేడమ్ మీకు మేమున్నాం.. ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటూ మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.
రాజుగారి ఇంట్లోకి కోడలిగా.. బడా బిజినెస్‌మెన్ కూతురు!
జిమ్ లో హీట్ ఎక్కిస్తున్న మిల్కీబ్యూటీ!