Monday, April 29, 2024
- Advertisement -

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రభాస్!

- Advertisement -

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్‌ ముందుంటారు. ఈ పాన్‌‌ ఇండియా స్టార్‌ పెళ్లి గురించి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ జనాలు కూడా గత కొన్నేళ్లుగా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గ‌తంలోనూ ప‌లుమార్లు ప్ర‌భాస్ పెళ్లి గురించి వార్త‌లు చాలానే వ‌చ్చాయి. సినీ న‌టులు మొద‌లు బిజినెస్‌మ్యాన్ కూతుర్ల వ‌ర‌కు చాలా మంది ప్ర‌భాస్ వివాహం చేసుకోబోయే జాబితాలో నిలిచారు.

స్టార్‌ హీరోయిన్‌ అనుష్కను పెళ్లాడబోతున్నారనే వార్తలు కూడా గతంలో చక్కరర్లు కొట్టాయి. అది నిజం కాకపోవడంతో ఆయన ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’ సిరీస్ పూర్తిచేసుకోగానే పెళ్లి చేసుకుంటాడని చెప్పుకున్నారు కానీ అవ‌న్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.తాజాగా అలాంటిదే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కృష్ణం రాజు సతీమణి సన్నిహితులైన ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని రాజుగారి ఇంట్లోకి కోడలిగా ఆహ్వానిస్తున్నారని ఆ వార్త సారాంశం.

ఆ అమ్మాయి అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఫౌండ‌ర్ కుమార్తె అని సమాచారం. అమ్మాయి వాళ్ల సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా అని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వారు అమెరికాలోనే సెటిల్ అయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఇరు కుటుంబాల మ‌ధ్య మాట‌లు జ‌రుగుతున్నాయ‌ని.. వారంద‌రూ ప్ర‌భాస్ మాట కోసం ఎదురుచూస్తున్నార‌ని టాక్. అంతేకాదు రాధే శ్యామ్ మూవీ విడుద‌ల త‌రువాత వీరి పెళ్లి ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈసారైనా ప్ర‌భాస్ పెళ్లి వార్త‌లు నిజం అవుతాయేమో చూడాలి.

త్వ‌ర‌లోనే టాలీవుడ్ యువ హీరో పెళ్లి!

ఈ కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

బాబోయ్‌.. అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

యువ హీరోతో లిప్‌లాక్‌కు రెడీ అయిన భామ‌..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -