తెలుగు బుల్లితెర హాట్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లైన కూడా ఏమాత్రం తరగని అందం అనసూయ సొంతం. జబర్థస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనుసూయ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఇక అనసూయకు సినిమాలలో కూడా పలు అవకాశాలు రావడంతో అటు బుల్లితెరను,ఇటు వెండితెరను ఏలుతోంది.
రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త క్యారెక్టర్‌లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత అనసూయకు పలు సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఎఫ్ 2 సినిమాలో కూడా తళుక్కున మెరిసింది ఈ భామ. తాజాగా అనసూయ ఓ సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్‌లో నటిస్తోంది. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించనుంది.
ఇంతకి ఆమె ఎవరు పాత్రలో నటిస్తుందో తెలుసా..?. వైఎస్ఆర్ హయంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్ర రెడ్డి క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనుంది. వైఎస్ఆర్ సబితాను చెల్లెలుగా భావించేవారు. మరి వైఎస్ బయోపిక్‌లో సబితా ఇంద్ర రెడ్డిని ఎలా చూపిస్తారో చూడాలి. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ