జబర్ధస్త్ షోతో బాగా పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం ఓ టీవీలో డేట్ విత్ అనసూయ షో చేస్తోంది. ఈ షోకు పలువురు సెలబ్రిటీలు వస్తుండడంతో ఈ షోకి మంచి స్పందన వస్తోంది. తాజాగా జరిగిన ఈ షోకు ముఖ్య అతిథిగా జ్యో అచ్యుతానంద సినిమా హిట్ జోష్‌లో ఉన్న రెజీనా వచ్చింది. అయితే ఈ షోకి వచ్చిన రెజీనాను అనసూయ ఓ ప్రశ్న అడిగింది.
నువ్వెప్పుడయినా తాగి గోల గోలా చేసి రచ్చ రచ్చ చేశావా అని అడిగింది. ఆ ప్రశ్నకి రెజీనా చెప్పిన జవాబు విని అనసూయ షాక్ అయ్యిందట. తాను చాలా సార్లు గాళ్ ఫ్రెండ్స్‌తో కలిపి తాగుతానని..అయితే భాయ్ ఫ్రెండ్స్‌తో కలిపి తాగలేదని చెప్పింది. అలాగే తాను రెండు, మూడు షాట్స్ మాత్రమే తాగుతానన్న రెజీనా ఓ సారి తాగి ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకోకుండా అలాగే పడుకున్నానని..అప్పుడు మా అమ్మ తనను చూసిందని…నాకు భాయ్ ఫ్రెండ్స్ ఎందుకు లేరని కూడా గోలగోల చేశానని రెజీనా ఓపెన్‌గానే అంతా చెప్పేసింది.
ఇవి విని అందరూ షాక్ అయ్యారు. అయితే వెంటనే రెజీనా కూడా అనసూయను ఇదే ప్రశ్న అడిగింది. దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అనసూయ కూడా తనకు తాగే అలవాటు ఉందని, కాని తాను తాగితే బలి అయ్యేది మాత్రం తన భర్త అని చెప్పుకొచ్చింది. దీంతో, షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Related