Sunday, April 28, 2024
- Advertisement -

రెండుసార్లు నా బిడ్డలను చంపేసుకున్నాను.. ఎమోషనలైన లాస్య

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా చేసి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది లాస్య. అప్పట్లో యాంకర్ రవి, లాస్య కలిసి చేసిన షోలు మంచి హిట్ అయ్యాయి. యాంకర్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మంజునాథ్ ను లాస్య పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. పైగా అతడితో ఆమెకు ఏడు సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది. అది కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లాస్య మొన్నటికి మొన్న తనకు ఒకే పెళ్లి రెండు సార్లు అయిందన్న విషయం పై ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చింది. మాములు ఫ్యామిలీ నుంచి వచ్చిన లాస్య.. మంజునాధ్ ను లవ్ చేయడం ఆమె తండ్రికి నచ్చలేదట. మంజునాథ్ ను పెళ్ళాడిన తర్వాత మూడేళ్ళు నాన్న మాట్లాడలేదని కన్నీళ్ళు పెట్టుకుంది లాస్య. నాన్నను బాధపెట్టి పెళ్లి చేసుకున్నాను. ఓసారి ఆయన బండిపై వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఎక్కువ గాయాలు అయ్యాయి. లక్షన్నర కోసం పది పదిహేను మంది వద్ద అయిదు వేలు పదివేల చొప్పున అప్పు తీసుకుని నాన్నను బాగు చేయించుకున్ననని చెప్పుకొచ్చింది.

అయితే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్‌లో లాస్య తన అబార్షన్, గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను చెప్పింది. మెదటి సారి 2010లో పెళ్లి అయిందని ఎవ్వరికి తెలీదని చెప్పింది. 2012లో కలిసి ఉన్నామని.. అప్పుడు గర్భం దాల్చాను కాని అబార్షన్ చేయించుకున్నాను. మరల 2014లో ఓసారి ప్రెగ్నెంట్ అయ్యాను.. అప్పుడు కూడా గర్భాన్ని తీసేయాల్సి వచ్చింది. ఇలా రెండుసార్లు నా బిడ్డలను నేనే చంపుకున్నానని ఎమోషనలైంది. రెండుసార్లు అబార్షన్ చెయించుకున్నాను కాబట్టి మళ్లీ పిల్లలు పుట్టరేమో అని బాధపడ్డాను అని చెప్పుతూ 2018లో మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు జున్ను పుట్టాడని చెప్పి అందర్నీ ఏడిపించింది.

ఈసారైనా హారిక కెప్టెన్ అవుతుందా…?

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు..?

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -