Thursday, April 25, 2024
- Advertisement -

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

- Advertisement -

మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల విద్యార్థులకు ఫీజుల ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో రూ. 12,155గా ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ. 15 వేలకు పెంచగా, రూ. 13,37,057గా ఉన్న బి కేటగిరీ ఫీజును రూ. 12 లక్షలకు తగ్గించారు. . గతంలో సి కేటగిరీ ఫీజు రూ. 33,07,500గా ఉండగా, ఇప్పుడు దానిని రూ. 36 లక్షలకు పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ. 15 లక్షలుగా సవరించారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కళాశాలలకు నూతన ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ఇతరత్రా ఫీజుల పేరుతో ఇంతకుమించి వసూలు చేసే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏ ప్రైవేటు కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్‌ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్‌ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 14 డెంటల్‌ కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు.

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -