లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే?

- Advertisement -

బుల్లితెర యాంకర్ లలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ సుమ ఒకరు. గత రెండు దశాబ్దాల నుంచి యాంకరింగ్ లో తనకి ఎవరూ సాటి లేరని చెప్పవచ్చు. బుల్లితెరపై ఏ ఈవెంట్ జరిగిన, ఏ కార్యక్రమం జరిగినా అక్కడ సుమ కనకాల కచ్చితంగా ఉండాల్సిందే. ఈ విధంగా పలు ఈవెంట్లో కార్యక్రమాల ద్వారా బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా కారణం వల్ల అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఈక్రమంలోనే సినిమా షూటింగ్ లు సైతం ఆగిపోవడంతో ఎంతోమంది తమ ఆదాయాన్ని కోల్పోయారు. కానీ లాక్ డౌన్ లో కూడా ఇంట్లో కూర్చొని రెండు చేతులు సంపాదిస్తున్న వారిలో కూడా సుమ కనకాల ముందు వరుసలో ఉన్నారు.

- Advertisement -

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ మధ్యకాలంలో సుమ కనకాల కేవలం యాంకరింగ్ విషయంలో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని బాగానే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సుమ కనకాల ఇంస్టాగ్రామ్ వేదికగా ఇడ్లీ డే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మదర్స్ డే ,ఫాదర్స్ డే లాగా ఇడ్లీ డే కూడా ఉందంటూ, ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి అంటూనే ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ లాక్ డౌన్ సమయంలో కూడా సంపాదిస్తున్నది నువ్వే సుమక్క అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు ఈ విధంగా కూడా ప్రమోట్ చేస్తారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -