Thursday, March 28, 2024
- Advertisement -

జిమ్ లో బాగా కష్టపడుతున్న నాగశౌర్య.. వైరల్ ఫోటో!

- Advertisement -

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సొంత నైపుణ్యంతో ఇండస్ట్రీలోకి “ఊహలు గుసగుసలాడే” చిత్రం ద్వారా అడుగుపెట్టి, “ఛలో” అంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ హీరో నాగ సౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. మొదటి సినిమాతోనే కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న నాగసౌర్య ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

తాజాగా హైదరాబాద్ టైమ్స్ అనౌన్స్‌ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉండే నాగసౌర్యకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జిమ్‌ వర్కవుట్‌ చేస్తూ..మాచో రిప్డ్‌ లుక్‌లో కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:సమంత కొడుకుగా నటించేది ఆ స్టార్ హీరో కొడుకే?

ఈ క్రమంలోనే నాగశౌర్య నటిస్తున్న లక్ష్య సినిమా కోసం గతంలో కూడా  8 ప్యాక్‌ బాడీతో పాటు పోనీ టెయిల్‌‌‌తో ఉన్న శౌర్య లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన పాత్రకు అనుగుణంగానే తన శరీరం ఎంత ఫిట్ గా ఉండాలని ఈ విధంగా జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక సినిమాల విషయానికొస్తే నాగశౌర్య ప్రస్తుతం వరుడు కావలెను, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి, లక్ష్య వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

Also read:ఆ నిర్మాణంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. దర్శకుడు అతడే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -