Thursday, April 25, 2024
- Advertisement -

స్టార్ యాంకర్ సుమ షాకింగ్ రెమ్యూనరేషన్

- Advertisement -

సుమ.. ఈ యాంకరమ్మ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై దాదాపు పదిహేనేళ్లగా అలరిస్తోంది. సుమ యాంకరింగ్ చేస్తే ఏ ఈవెంట్ అయినా హిట్టే అన్నట్లు చాలా మంది భావిస్తుంటారు. పుట్టింది కేరళలోనైనా.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ..ఇక్కడి వారికి దగ్గరైపోయింది. అయితే బుల్లితెరపై అలరించిన సుమ.. వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి భారీ పారితోషికమే డిమాండ్ చేస్తోందట.

సుమ వెండితెరపై ఓ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. అదే ‘జయమ్మ పంచాయితి’. విజయ్‌ కుమార్‌ కలివారపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్‌తో పాటు ఓ పాట కూడా విడుదలయ్యింది.స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుమ.. ఒక్కొక్క ఈవెంట్ కోసం రూ. 1 నుండి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది.

అయితే తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి జయమ్మ పంచాయతి సినిమాలో నటించిన సుమ.. ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందట. సుమ నటించిన సినిమా అంటే హైప్ వస్తుంది కాబట్టి నిర్మాతలు కూడా ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడలేదని సమాచారం.

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనుసూయ

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -