Tuesday, April 30, 2024
- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్

- Advertisement -

ఏపీలో ఎట్టకేలకు సినిమా టికెట్ల వివాదానికి తెరపడింది. థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించిన సర్కార్.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని థియేటర్లకు వేర్వేరు ధరలను ఫిక్స్ చేసింది. కనీస టికెట్ ధరను 20 రూపాయలుగా, గరిష్ట టికెట్ ధరను 250గా నిర్ణయించింది. ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్‌ అన్న తేడా లేకుండా ప్రతీ థియేటర్‌లో నాన్ ప్రీమియం కేటగిరి కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జీవోలో పేర్కొంది.

మున్సిపల్ కార్పొరేషన్లలోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 40 రూపాయలు, ప్రీమియం టికెట్ ధర 60గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 70, ప్రీమియం టికెట్ ధర 100 రూపాయలుగా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్100, ప్రీమియం టికెట్ ధర 125 రూపాయలు ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు 150, రిక్లైన్ సీట్లకు 250గా నిర్ణయించారు.

మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 30 రూపాయలు, ప్రీమియం టికెట్ ధర 50గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 60, ప్రీమియం టికెట్ ధర 80 రూపాయలుగా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 80, ప్రీమియం టికెట్ ధర 100 ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు 125, రిక్లైన్ సీట్లకు 250గా నిర్ణయించారు.

నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 20, ప్రీమియం టికెట్ ధర 40 రూపాయలుగా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 50, ప్రీమియం టికెట్ ధర 70గా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర 70, ప్రీమియం టికెట్ ధర 90 రూపాయలుగా ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు రూ.100, రిక్లైన్ సీట్లకు రూ.250గా నిర్ణయించారు.

స్టార్ యాంకర్ సుమ షాకింగ్ రెమ్యూనరేషన్

భీమ్లా నాయక్‌ సినిమా క్యాస్టింగ్‌లో ఆసక్తికర విషయాలు

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -