Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పటాస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం “ఎఫ్ 2” సినిమాకి సీక్వెల్ గా “ఎఫ్ 3” తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తన తర్వాత ప్రాజెక్టును నటసింహం నందమూరి బాలకృష్ణతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే సమాచారం వినబడుతుంది.

Also read:సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. ఈసారైనా విజయం అందుకుంటాడు?

బాలకృష్ణ తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను బాలకృష్ణకి కూడా వినిపించారు.ఇక బాలకృష్ణ నుంచి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. బాలకృష్ణ నుంచి ఎటువంటి సమాధానం లేకపోయినా ఈ సినిమాపై అనిల్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.బాలకృష్ణతో ఈ సినిమా తీయడం కోసం అనిల్ తన మామూలు సినిమాల మాదిరిగా కాకుండా బాలకృష్ణ రేంజ్ కు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.అనిల్- బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశాలున్నాయి.

Also read:వైరల్ గా మారిన నటి రాధిక కొత్త లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -