Saturday, April 20, 2024
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కన్నుమూత!

- Advertisement -

తమిళ స్టార్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ కేవీ ఆనంద్(54) గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు, తన చిత్రాల డబ్బింగ్ వర్షన్లతో దక్షిణాదికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.

ప్రేమదేశం, ఒకే ఒక్కడు, శివాజీ తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన, ఆపై కణా కండేన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, డైరెక్టర్ గా మారారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం), మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు.

1994లో వచ్చిన మలయాళ సినిమా ‘తెన్మావిన్ కోంబత్’తో సినిమాటోగ్రఫర్​గా పరిచయమైన ఈయన.. దాదాపు పదేళ్లపాటు విజయవంతంగా కెరీర్​ కొనసాగించారు. ప్రీ లాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్‌ ను స్టార్ట్ చేసిన ఆయన, ఇండియా టుడే సహా పలు పత్రికల్లో పని చేశారు. ఆపై పీసీ శ్రీరామ్ శిష్యుడిగా మారి పలు సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి, ఆపై దర్శకుడిగా మారారు. కేవీ ఆనంద్ మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

తెలంగాణలో మినీ పురపోరు పోలింగ్ ప్రారంభం

బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

కూకట్ పల్లిలో కాల్పుల నిందితుల అరెస్ట్.. ఆ తప్పుతోనే బుక్కయ్యారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -