Sunday, April 28, 2024
- Advertisement -

సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. ఈసారైనా విజయం అందుకుంటాడు?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ కొడుకు, బెల్లంకొండ శ్రీనివాస్ “అల్లుడు శీను” సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ బెల్లంకొండ అబ్బాయి తర్వాత నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి.తాజాగా సంక్రాంతికి విడుదలైన “అల్లుడు అదుర్స్” చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ వైపు తన దృష్టి సారించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చత్రపతి సినిమా బాలీవుడ్ రీమేక్ చేయాలని భావించాడు. ఈ రీమేక్ సినిమాను వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

Also read:ఒకటి కాబోతున్న దీప్తి సునయన, షణ్ముఖ్.. పెళ్లి ఎప్పుడంటే?

ఈ బాలీవుడ్ రీమేక్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా శ్రీనివాస్ కొన్నారు అని తెలియడంతో ఈ సినిమా తీయడం పక్కా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ విజయం సాధించడం పక్క అని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Also read:పూజా హెగ్డే మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -