Friday, May 3, 2024
- Advertisement -

వైరల్ గా మారిన నటి రాధిక కొత్త లుక్!

- Advertisement -

నటిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్న రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలలో,స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోయిన్ బుల్లితెరపై కూడా తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాధికఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు దూరం అయ్యారు. గత కొన్ని రోజుల క్రితం చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన విషయంలో నటి రాధిక, తన భర్త శరత్ కుమార్ కి జైలు శిక్ష పడిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంలో తాము హైకోర్టుకు వెళ్తామని సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు వార్తలను నమ్మకండి అంటూ తెలిపారు.

Also read:సుమ తర్వాత నేనే.. వాళ్ళలా తప్పులు చేయనంటున్న యాంకర్!

తాజాగా రాధిక సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్ చేస్తూ.. ఈ ఫోటో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ తన జుట్టును మొత్తం కత్తిరించి ఉన్నటువంటి కొత్త లుక్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను ఆకట్టుకుంది.

Also read:అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -