సునీల్ కమెడియన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి హీరోగా మారాడు. హీరో అయ్యాక మొదట్లో సక్సెస్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు సునీల్ పరిస్థితి మారింది. గత మూడేళ్ళుగా హిట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన జక్కన్న సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సునీల్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు వినోదంతో సంతోష పడుతున్నప్పటికీ ఏమాత్రం ఆశాజనకంగా లేని కథ, కథనాలతో నీరసించి పోతున్నాడు ప్రేక్షకుడు. దర్శకుడి గా వంశీకృష్ణ ఫెయిల్ కాగా సునీల్ ఆశలన్నీ నీరుగారి పోయాయి. పృథ్వీ కామెడి జక్కన్న సినిమాలో కాస్త బెటర్.
మన్నారా అందాలతో అలరించిన జక్కన్న సినిమాని హిట్ చేయలేకపోయాయి. ఇదే రోజున రిలీజ్ అయిన మరో చిత్రం పెళ్లి చూపులు చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.
Related