Sunday, May 19, 2024
- Advertisement -

జక్కన్న మూవీ రివ్యూ!

- Advertisement -

అల్లరి నరేష్ తో పాటు కామెడీ హీరోగా బాగానే రాణిస్తున్న హీరో సునీల్ కి సరైన హిట్ లేదు, ఎప్పుడూ ఒకే పంథాలో వెళ్ళడం లేకపోతే రీమేక్ లు పేలవంగా తీయడం తో ఇతని కెరీర్ ఇబ్బందుల్లో పడింది. చాలా కాలం తరవాత సరైన హిట్ కోసం ఎదురు చూసిన సునీల్ స్వయంగా తానే రైటర్ ల దగ్గర ఉండి మరీ ఒక కథ రాయించుకుని దీనికి జక్కన్న అనే పేరు పెట్టాడు.

ఈ సినిమా మాస్ + కామెడీ ఎలిమెంట్ లు కలిసి ఉంటుంది అని సునీల్ మొదటి నుంచీ చెబుతున్నాడు. హీరోగా మాత్రమె కాక ఈ సినిమాకి మెంటార్ గా కూడా పనిచేసిన సునీల్ ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు అవి ఎంతవరకూ వర్క్ అయ్యాయో చూద్దాం రండి.

ప్లస్ పాయింట్ లు :

గణేష్ /జక్కన్న (సునీల్).. తనకు సాయం చేసిన వారికోసం ఎంతదూరమైనా వెళ్ళి, వారి బాగుకోసం కష్టపడే మనస్థత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి వైజాగ్ సిటీకి పెద్ద రౌడీ అయిన భైరాగి (కబీర్ సింగ్) అనుకోకుండా ఒక సాయం చేస్తాడు. ఆ సాయానికి బదులుగా భైరాగి బాగుండాలని అతడి కోసం వెతుకుతూ గణేష్ వైజాగ్ వస్తాడు. గణేష్‌కి భైరాగి చేసిన సాయం ఏంటి? అసలు ప్రపంచానికి తానెవరో తెలీకుండా రౌడీయిజం చేసే భైరాగిని గణేష్ ఎలా కలుసుకుంటాడు? తనకు చేసిన సాయానికి బదులుగా భైరాగికి గణేష్ ఏం చేశాడు? అనేది థియేటర్ లో చూడాల్సిందే. సునీల్ ఈ సినిమాని పూర్తిగా హ్యాండిల్ చేసాడు అని చెప్పచ్చు. గణేష్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయిన సునీల్ తన నటన ని హై లైట్ గా చూపించాడు. డాన్స్ మాత్రమే కాకుండా ఫైట్ ల దగ్గరా కామెడీ విషయం లో తన కమర్షియల్ యాంగిల్ ని చూపిస్తూ మంచిగా నటించాడు. మన్నారా చోప్రా నటన కూడా చాలా బాగుంది. పృధ్వీ కామెడీ ఈ సినిమాకి హై లైట్ కామెడీ ని అందించాడు. సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ ని ఇమిటేట్ చేస్తూ సాగిన సన్నివేశాలు బాగా కుదిరాయి.లన్‌గా నటించిన కబీర్ సింగ్ కూడా బాగానే చేశాడు. సినిమా పరంగా చూసుకుంటే, సెకండాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక ఒక ఇరవై నిమిషాల ఎపిసోడ్‌ను ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సప్తగిరి మాస్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.

మైనస్ పాయింట్ లు :

సునీల్ లాంటి హీరోతో కామెడీ చేయించాలి అనుకోవడం సహజమే కానీ డైరెక్టర్ ఇక్కడే ఇబ్బంది పడ్డాడు. సునీల్ తో కామెడీ చేసే ప్రయత్నం పేలవంగా మారడం తో బోర్ కొట్టేసింది. సింపుల్ స్టోరీ ని ఎదో విషయం ఉన్నట్ట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్. స్పూఫ్ కామెడీ లు విసిగిపోయిన జనాలు కామెడీ దగ్గర చిరాకు పడ్డారు. ఒకే కథనం తో రెండు గంటల సినిమా నడిపించడం కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష అనే చెప్పాలి. ముఖ్యంగా తనకు సాయం చేసిన వారికి తిరిగి వాళ్ళు వద్దనే వరకూ సాయం చేసే లక్షణాలున్న హీరో పాత్రను స్పష్టంగా డిజైన్ చేయలేకపోయారు.

మొత్తంగా :

సునీల్ జక్కన్న గా మంచి పాత్ర చేసినా డైరెక్టర్ తన స్థాయికి రేంజ్ లో తీయలేదు. రైటర్ లని ఏకంగా ఐదుగురిని పెట్టుకున్నా ఒక్కరు కూడా సరైన కామెడీ ట్రాక్ రాయలేకపోయారు. సెకండ్ హాఫ్ లో పృధ్వీ కామెడీ తప్ప పెద్దగా ఏమీ పేలలేదు మరి. డైరెక్టర్ రాసిన స్క్రీన్‌ప్లేలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా ఏవీ లేవు. హీరోకి, విలన్‌కి లింక్ కుదర్చడం, పృథ్వీ కామెడీ, సునీల్ టైమింగ్‌ని కొన్నిచోట్ల వాడడం.. ఇలాంటి విషయాల్లో దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు. సునీల్ – పృధ్వీ రాజ్ ల కామెడీ కోసం ఒక్కసారి చూడచ్చు గానీ, పూర్తి స్థాయి ఫుల్ టూ కామెడీ మాత్రం ఈ సినిమాలో లేదంటే లేదు.

జక్కన్న రేటింగ్ : 3/ 5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -