Monday, May 6, 2024
- Advertisement -

ఆరోజు వేదిక వెనక్కెళ్ళి ఏడ్చాను.. అనుష్క శర్మ!

- Advertisement -

బాలీవుడ్ అందాల హీరోయిన్ అనుష్క శర్మ తన మొదటి చిత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ‘రబ్ నే బనాదీ జోడీ’ సినిమాలో నటించి విశేషమైన ప్రజాదరణ పొందింది. తర్వాత వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.సినిమాల పరంగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

అనుష్క శర్మ తాజాగా మే 1తన 33వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అనుష్క శర్మకి కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్‌‌పై ఆసక్తి ఉండేదినీ, తనని కాలేజ్‌లో ‘నువ్వు ఏం అంత అందంగా ఉన్నావ్‌? కేవలం సన్నగా నాజూకుగా ఉన్నావు తప్ప పెద్దగా గ్లామర్ ఏమీ లేదు’ అని కామెంట్లు చేసేవారని, ఆ మాటలకు చాలాసార్లు బాధపడ్డా అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. తర్వాత మోడలింగ్ రంగంలో రాణించడంతో సినీ అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

అనుష్క శర్మ తొలి చిత్రం ‘రబ్‌ నే బనాదీ జోడీ’ సక్సెస్ సాధించడంతో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డ్‌ అయినా దక్కుతుందని భావించి ఆ వేడుకకి వెళితే ఆ అవార్డు కూడా నోచుకోలేదని, దాంతో అప్పుడు కూడా కన్నీళ్లు ఆగలేదని అనుష్క తెలిపింది.సినిమా తర్వాత కలలన్నీ తారుమారయ్యాయని వేదిక వెనక్కి వెళ్లి ఏడుస్తుంటే అమితాబ్‌ బచ్చన్‌ వెనుక నుంచి వచ్చి ‘రబ్‌ దే బనాది జోడీ’ చూశా, అందులో మీ నటన చాలా బాగుందని చెప్పడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, అమితాబచ్చన్ అన్న ఆమాటే పెద్ద అవార్డుగా భావించానని తన గత అనుభవాలను చెప్పుకొచ్చింది.

Also read:ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్.. డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు అలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -