Friday, March 29, 2024
- Advertisement -

లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

- Advertisement -

“రంగస్థలం” సినిమా వరకు క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న సరి కొత్త యాంగిల్ ను బయట పెట్టాడు. ఇప్పుడు అదే మాస్ యాంగిల్ ను మరింత పెంచుతూ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా తరహాలో “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మనకు కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన “విలన్ ” చిత్రం ఆధారంగా తీసుకుని సుకుమార్” పుష్ప” సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది.

Also read:గొప్ప డైరెక్టర్ ఇక లేరన్న వార్త బాధాకరం.. అల్లు అర్జున్!

విలన్ సినిమాలో తన చెల్లెలకి జరిగిన అన్యాయం పై హీరో ఏ విధంగా పగ తీర్చుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ కి చెల్లెలు ఉందని సినిమా మొత్తం ఈ చెల్లెలు పాత్ర పై ఆధారపడి ఉందని వార్తలు వినిపించాయి.ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు కూడా తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే సుకుమార్ మణిరత్నం “విలన్” సినిమాను కాపీ కొట్టాడని సమాచారం వినబడుతోంది. అయితే సుకుమార్ నిజంగానే పుష్ప సినిమాను కాపీ చేశారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Also read:ఈ చెత్త రాజకీయాలు ఇలాగే ఉంటాయి.. సైలెంట్ గా చేసే వాళ్లే హీరోలు.. పూనమ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -