Wednesday, April 24, 2024
- Advertisement -

ఎన్టీఆర్-శివ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా.. ఆ స్టార్ హీరో?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30 సినిమాను ఏ దర్శకుడితో తీరుస్తారనే చర్చలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే తారక 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని భావించినప్పటికీ, చివరికి ఎన్టీఆర్ కు “జనతా గ్యారేజ్” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను ప్రకటించారు.

వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోందని, ఇందులో తారక్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరొక సమాచారం వైరల్ గా మారింది.

Also read:మల్టీ స్టారర్ గా ఎనర్జిటిక్ హీరోతో రెడీ అవుతున్న క్రాక్ హీరో.. దర్శకుడు ఎవరంటే?

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా స్టార్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ధ్రువ సినిమా ద్వారా తన అసలైన విలనిజాన్ని ప్రదర్శించి మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో అరవిందస్వామి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.శివ తయారుచేసుకున్న కథకు అరవిందస్వామి కరెక్ట్ గా సరిపోతాడని చిత్రబృందం భావించింది.దీంతో ఇప్పటికే అరవిందస్వామితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.అయితే దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న అరవిందస్వామి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -