Friday, March 29, 2024
- Advertisement -

వకీల్ సాబ్ వల్ల అమ్మాయిలు కావాలంటూ ఫోన్లు.. చిత్ర యూనిట్ పై కేసు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాను మనం బాగా గమనించినట్లైతే ఈ సినిమాలో అంజలి పరువు మర్యాద తీయడానికి రౌడీలు ఆమె అసభ్యకరమైన ఫోటోలను నెట్లో పెట్టి అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అంటూ స్క్రీన్ పై ఒక నెంబర్ చూపిస్తారు. అయితే ఆ నెంబర్ వల్ల ప్రస్తుతం ఓ వ్యక్తి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలో వాడిన ఫోన్ నెంబర్ తనదేనని,తన అనుమతి లేకుండా ఫోన్ నెంబర్ వాడటం వల్ల ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఆ ఫోన్ నెంబర్ తీసుకుని కొందరు ఆకతాయిలు మాకు అమ్మాయిలు కావాలంటూ ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారని సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also read:ఆ దేశంలో పుట్టి తెలుగులో హిట్ కొట్టిన.. హీరో ఎవరో తెలుసా?

తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ఈ విధంగా సినిమాలో స్క్రీన్ పై చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా నిర్మాత దిల్ రాజుకు లీగల్ నోటీసులు పంపించారు. మరి ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఫోన్ నెంబర్ వ్యవహారంతో వకీల్ సాబ్ సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Also read:మల్టీ స్టారర్ గా ఎనర్జిటిక్ హీరోతో రెడీ అవుతున్న క్రాక్ హీరో.. దర్శకుడు ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -