Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బోల్డ్ బ్యూటీ

- Advertisement -

బుల్లితెరపై దుమ్మురేపిన రియార్టీ షో బిగ్‌బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌’లో తెలుగులో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుండగా.. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్​టైన్​మెంట్ అంటూ ప్రోమోను కూడా రిలీజ్‌ చేశారు.

తెలుగులో మొదటిసారిగా 24 గంటలు పాటు ప్రసారం కానున్న ఈ షోలో కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, ఓ బోల్డ్ బ్యూటీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

అషు రెడ్డి ..ఓటీటీ వేదికగా బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్లు బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లింగ్ హింట్ ఇచ్చాడు. ‘ఆల్​ ది బెస్ట్​ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో’ అంటూ పోస్ట్​ చేశాడు రాహుల్. దీంతో అందరూ అషు రెడ్డి బిగ్​బాస్​ నాన్​స్టాప్​లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు.

మరో సారి రెచ్చిపోబోతున్న నట సింహం

దేవ కన్యలా సమంత

ఏపీలో పొగబెడుతున్నారు.. తెలంగాణలో రా..రమ్మంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -