అక్కడా దుమ్ము రేపిన అల్లు అర్జున్ మూవీ

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్​ 2022 అవార్డుకు ‘పుష్ప’ ఎంపికైంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.

సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ ఏడాది డిసెంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్.

మరోసారి సెంటిమెంట్ ఫాలోఅవుతున్న త్రివిక్రమ్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

Most Populer

Recent Posts