బాహుబలి 2 సినిమా ఉహించని రికార్డు సొంతం చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు చేసినట్టు సమాచారం. బాక్సాఫీస్ ఇండియా డాట్ కామ్ ప్రకారం గడిచిన మూడు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్ల సునామీతో రూ.506 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇది ప్రివ్యూలతో కలిపితే రూ.520 కోట్లు.
ఇందులో ఒక్క భారత్‌లోనే మొత్తం వసూళ్లు రూ.385కోట్లు ఉండగా.. విదేశాల్లో రూ.121 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రధానంగా ఓవర్సీస్ దేశాలైన అమెరికా, కెనడా, గల్ఫ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది వరకు ఉన్న రికార్డులు అన్ని కూడా ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది.
‘బాహుబలి ది బిగినింగ్’కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి కన్‌క్లూజన్ గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు మంచి కథాబలం తోడవడంతో దుమ్మురేచిపోయే రేంజ్‌లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈనెల 28వ తేదీన విడుదలైన ఈ మూవూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే.. వచ్చే వారాంతం వరకు అన్ని థియేటర్లలో టిక్కెట్లు బుక్క అయిపోయాయి. దీంతో ‘బాహుబలి’ మూవీ రూ.వెయ్యి కోట్ల మేరకు వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
{youtube}Nt21Rqkent8{/youtube}
Related