Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలి 2 లో ప్రేక్షకులకు నచ్చని అంశాలు ఇవే

- Advertisement -
bb2 some disappoint elements

బాహుబలి – ది కంక్లూజన్ సినిమా మొత్తంగా చాలా బాగుంది. భారీ వసూళ్లతో పాటు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని అంశాలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

* భళ్లాలదేవ పాత్రను పార్ట్-1 పవర్ ఫుల్ గా చూపించారు. భళ్లాలదేవ కొడుకుని కూడా చూపించారు. పార్ట్-1లోనే శివుడి చేతిలో భళ్లాలదేవ కొడుకు మరణిస్తాడు. పార్ట్-2లో కూడా ఆ కనెక్షన్ ఉంటుంది. కాకపోతే భళ్లాలదేవుని భార్య ఎవరనేది ఎక్కడా చూపించరు. నిజానికి కథకు భళ్లాల భార్యకు సంబంధం లేకపోవచ్చు. కానీ కొడుకును చూపించినప్పుడు భార్యను కూడా చూపిస్తే బాగుండేది

* శివగామిని అద్భుతంగా నటించారు. శివగామి యుద్ధం చేసి, పసికందును రక్షించడం కోసం తను తప్పించుకున్నట్టు చూపిస్తే బాగుండేది. పైగా మాహిష్మతి సామ్రాజ్యంలోనే ఆమె నీటిలో మునిగిపోయినట్టు చూపించారు. కానీ పార్ట్-1లో ఆమె జలపాతం కింద తేలినట్టు చూపించారు. ఈ రెండు సన్నివేశాలకు చిన్నపాటి కనెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది

* బాహుబలిని చంపాలని శివగామి, కట్టప్పను ఆదేశించే క్రమం చాలామందికి నచ్చలేదు. పార్ట్-1లో కానీ, పార్ట్-2లో కానీ తన సొంత కొడుకు కంటే ఎక్కువగా బాహుబలిని పెంచింది శివగామి. అలాంటి వ్యక్తిపై అతి తక్కువ టైమ్ లో శివగామి అపనమ్మకానికి రావడం చాలామందికి రుచించలేదు

* పార్ట్-1లో శివుడు, అవంతిక మధ్య రొమాన్స్ ను అద్భుతంగా చూపించారు. అసలు అవంతిక కోసమే తన ప్రాణాలకు తెగిస్తాడు శివుడు. అంతలా ప్రేమించిన అవంతికను పెళ్లాడినట్టు చివర్లో చూపిస్తే బాగుండేది. అలా చేస్తే అవంతిక పాత్రకు కూడా మంచి ముగింపు ఇచ్చినట్టయ్యేది.

నిజానికి ఈ లోటుపాట్లు రాజమౌళికి తెలియనివి కావు. కాకపోతే అప్పటికే నిడివి పెరిగిపోవడంతో కొన్ని పాత్రల్ని, మరికొన్ని సన్నివేశాల్ని కుదించాల్సి వచ్చింది. ఓవరాల్ గా సినిమాను మాత్రం ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి 2 ఫస్ట్ డే వసూళ్లు
  2. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్
  3. బాహుబలి 2 మూవీ రివ్యూ
  4. బాహుబలి మూవీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -