Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి 2 ఫస్ట్ డే వసూళ్లు

- Advertisement -
Baahubali 2 First Day Collections

బాహుబలి 2 ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో గురువారం రాత్రి నుంచి బాహుబలి కలెక్షన్ల వేట మొదలైనా.. అఫీషియల్ గాశుక్రవారం ఎర్లీ మార్నింగ్ షోతో బాహుబలి హవా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే బిజినెస్ ఎనలిస్ట్ లు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం మీద బాహుబలి 2 మొదటి రోజే దాదాపు 100 కోట్లు వరకు వసూళ్లు సాధిస్తోందని భావించారు.

అయొతే అందరికి షాక్ ఇచ్చేలా తొలి 24 గంటల్లో కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి 2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. సౌత్ లో వందకోట్ల వసూళ్లు ఫుల్ రన్ లో సాధించటమే కష్టంగా ఉన్న రోజుల్లో.. తొలి రోజే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డ్ ను సెట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టడం ప్రారంభించిన ఈ భారీ చిత్రం.. ఫుల్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే తొలి రోజే 150 కోట్ల మార్క్ కు బాహుబలి 2 చేరువైనట్టే. అయితే అనధికారిక సమాచారం ప్రకారం 180 కోట్లు వరకు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Related

  1. స్టార్ డైరెక్టర్ కి బాహుబలి టికెట్ దొరకలేదు.. మరి ఏం చేసాడో తెలుసా?
  2. బాహుబలి 2 మూవీలో లోపం ఏంటో తెలుసా..?
  3. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్
  4. బాహుబలి 2 మూవీ రివ్యూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -