Friday, May 17, 2024
- Advertisement -

రజనీకాంత్, శంకర్ బాహుబలి 2 అందుకుంటారా..?

- Advertisement -
Can Robo 2.0 Cross Baahubali 2 Collections

‘బాహుబలి 1’ ప్రభంజనం తర్వాత శంకర్‌ ‘రోబో’కి సీక్వెల్‌ అనౌన్స్‌ చేసాడు. మన సినిమా పరిధి ఎంతనేది తెలియడంతో ధైర్యంగా ‘రోబో 2’పై కోట్లకి కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. రజనీకాంత్‌కి శంకర్‌ తోడయితే, దానికి రోబో బ్రాండ్‌ కూడా కలిస్తే ‘బాహుబలి’ని మించిన విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.

అయితే ‘బాహుబలి 2’ చిత్రం బాక్సాఫీస్‌కి బెంచ్‌ మార్క్‌ని డబుల్‌ చేసి పెట్టింది. రజనీకాంత్‌ గత చిత్రం ‘కబాలి’కి దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ వచ్చిందో తెలిసిందే. ఆ చిత్రానికి మొదటి రోజు ఎనభై ఏడు కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వస్తే, ‘బాహుబలి 2’కి రెండు వందల కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి.  రజనీకాంత్‌కి శంకర్‌ జత కలిసాడు కనుక తెలుగునాట, అక్షయ్‌కుమార్‌ విలన్‌ కాబట్టి హిందీలో ‘కబాలి’ కంటే ఎక్కువ క్రేజ్‌ వుంటుందని భావిస్తున్నారు. ఇక ‘రోబో’కి సీక్వెల్‌ అనేది ఖచ్చితంగా పెద్ద ఎస్సెట్‌.

అయినప్పటికీ ఈ పాయింట్స్‌ అన్నిటితో ‘బాహుబలి 2’ని కొట్టే ఓపెనింగ్‌ రాబట్టుకుంటుందా అనేది అనుమానమే. ‘బాహుబలి’ చిత్రం ప్రధానంగా నార్త్‌ ఇండియాలో చేస్తోన్న విధ్వంసం అలా ఇలా లేదు. దక్షిణాదిలో బాహుబలి 2ని ‘2.0’ మ్యాచ్‌ చేసినా, ఉత్తరాదిలో దాంట్లో సగమైనా వస్తుందా అనేది అనుమానమే. మొత్తానికి సూపర్‌స్టార్‌కి, స్టార్‌ డైరెక్టర్‌కి ‘బాహుబలి 2’ అతి పెద్ద సవాల్‌నే విసిరింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి 2 లో ప్రేక్షకులకు నచ్చని అంశాలు ఇవే
  2. బాహుబలి 2 ఫస్ట్ డే వసూళ్లు
  3. స్టార్ డైరెక్టర్ కి బాహుబలి టికెట్ దొరకలేదు.. మరి ఏం చేసాడో తెలుసా?
  4. బాహుబలి 2 మూవీలో లోపం ఏంటో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -