Saturday, May 11, 2024
- Advertisement -

బాహుబలి-2 ట్రైలర్ ఎప్పుడంటే..?

- Advertisement -
Baahubali 2 Movie Theatrical Trailer Release Date

ప్రస్తుతం ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా మీద ఉన్న అంచనాలు మరే సినిమా మీద  లేవు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రతి సినీ ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఇంకో యాభై రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అంతకంటే ముందు ట్రైలర్ రుచి చూపించబోతున్నాడు రాజమౌళి. ఈ నెల 15న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ రిలీజవబోతున్నట్లు తాజా సమాచారం. ఆల్రెడీ మార్చి మధ్యలో ట్రైలర్ వస్తుందని రాజమౌళి ప్రకటించాడు. కాకపోతే ఇంకా వీఎఫెక్స్ స్టూడియో నుంచి కంటెంట్ రాని నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ డేట్ ఎప్పుడో చెప్పలేనన్నాడు. ఐతే ఇప్పుడు కంటెంట్ చేతికొచ్చిందో ఏమో.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లుంది.

‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్ రెండేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడానికి ఆ ట్రైలరే కారణం. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’పై ఇప్పటికే ఉన్న భారీ అంచనాల్ని ట్రైలర్ మరింతగా పెంచుతుందేమో చూడాలి. ట్రైలర్ రిలీజయ్యాక ఓ రెండు వారాల వ్యవధిలో ఆడియో వేడుకను భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.

{youtube}gP32Eykq27E{/youtube}

Related

  1. బాహుబలి రిలీజ్ చేస్తే.. థియేటర్లను తగులబెడుతారట..!
  2. బాహుబలి-2లో మరో హీరోయిన్.. ఆమె పాత్ర ఏంటంటే?
  3. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
  4. మోడీకి షాకిచ్చిన బాహుబలి!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -