Saturday, April 20, 2024
- Advertisement -

బాలయ్య గోపీచంద్ సినిమా.. అదిరిపోయిన టీజర్!

- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు 61 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే నందమూరి సింహానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబాయికి అబ్బాయిలు కళ్యాణ్ రామ్, తారక్ పుట్టినరోజు వేడుకలను తెలియజేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం వదిలారు.

గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా NBK107 పేరుతో చిత్రబృందం ఓ వీడియోని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు . ఈ సందర్భంగా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ వదిలిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారి నందమూరి అభిమానులను ఆకట్టుకుంది.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య బాబు ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులని ఉద్దేశించి ఎవరు కూడా పుట్టిన రోజు వేడుకలను జరపకుండా ప్రతి ఒక్కరు ఇంట్లోనే క్షేమంగా ఉండాలని తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాలయ్య బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Also read:భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్క సినిమాకు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -