Saturday, April 27, 2024
- Advertisement -

హైదరాబాద్ జూలో ఏనుగు, చిరుత మృతి!

- Advertisement -

హైదరాబాద్ జూ పార్క్‌లో జంతువులు మృత్యువాత పడ్డాయి. నెహ్రు జులాజికల్ పార్కులో ఏనుగు మరియు చిరుత పులి చనిపోయాయి. 1938 సంవత్సరంలొ జన్మించిన ఈ ఏనుగు జూపార్కు వచ్చే సందర్శకులకు ఓ ఆకర్షణగా ఉండేది. వృద్ధాప్యం కారణంగా 83 సంవత్సరాల రాణి అనే (ఆడ) ఏనుగు మృతి చెందింది. ఏనుగులు సర్వ సాధారణంగా అడవుల్లొ 70 సంవత్సరాల లొపు జీవిస్తాయి. జూ పార్కులో ఉండటం వల్ల.. ప్రత్యేకంగా ఆహరం, వైద్యుల సంరక్షణలొ ఉండటంతో ఏనుగు 83 సంవత్సరాల వరకు జీవించింది.

నగరంలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేంగిపులో కొన్నేళ్లపాటు ‘గజరాణి’ పాల్గొంది. గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు.

16 జూన్ 2000వ సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో జన్మించిన ఈ చిరుత పేరు ‘అయ్యప్ప’. సాధారణంగా చిరుతల జీవిత కాలం 15 ఏళ్లు మాత్రమేనని, అయితే జూలో వాటి సంరక్షణపై తీసుకునే శ్రద్ధ, ఆహారం కారణంగా ‘అయ్యప్ప’ మరో ఆరేళ్లు అధికంగా జీవించిందని అధికారులు తెలిపారు.

ముంబైలో కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. 9 మంది మృతి

టాలీవుడ్ విషాదం : ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

నేటి పంచాంగం,గురువారం(10-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -