Thursday, April 25, 2024
- Advertisement -

బాలకృష్ణ ’అఖండ’ విడుదల తేదీ వచ్చేసింది..!

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 28 వ తేదీన విడుదల చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ లో డిలే జరిగింది. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పూర్తయింది.

కాగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల అవుతుందని నందమూరి అభిమానులను కలవర పడ్డారు.

కాని ’ఆర్ ఆర్ ఆర్’ ను అక్టోబర్ 13న విడుదల విరమించుకోవడంతో ఇప్పుడు అదే రోజున అఖండ విడుదల డేట్ ను ఫిక్స్ చేయనున్నారట. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు కారణం బోయపాటి -బాలకృష్ణ కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ లు సింహా, లెజెండ్ రావడమే. వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా అఖండ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి మరి.

Also Read: పవన్ కళ్యాణ్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -